29 August, 2026 | 5:47 PM

రిటైర్డ్ హెచ్ఎం ‘సమ్మెట’కు అరుదైన పురస్కారం

29-08-2026 04:42 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాకు చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ సమ్మెట వెంకటేశ్వర్లుకు అరుదైన పురస్కారం దక్కింది. చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో శ్రీ గౌతమేశ్వర సాహితీ సేవా కళా సంస్థ నిర్వహించిన కవితా రచన పోటీలో పాల్గొని ఉత్తమ ప్రచురణ పొందిన రచన (రక్షా బంధన్) కు అక్షర రక్షాబంధన్ పురస్కారంతో పాటు బంగారు పతకాన్ని సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ చేతుల మీదుగా అందుకున్నారు.