29 August, 2026 | 5:47 PM

మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం

29-08-2026 04:42 PM

చెన్నూర్,(విజయక్రాంతి): పాన్ షాపులు, హోటళ్లు,ఇతర ప్రాంతాల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెన్నూర్ పట్టణ సిఐ బన్సీలాల్ హెచ్చరించారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలో  నార్కోటిక్ డాగ్ తో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో తనిఖీల అనంతరం సిఐ మాట్లాడారు. మత్తు పదార్థాల వల్ల జీవితాలు రోడ్డున పడి కుటుంబాలను కోల్పోయిన వారు ఎందరో మన కండ్ల ముందు కనపడినప్పడు బాధ కలుగుతుందన్నారు.

మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత తమ మనస్సుల్లోకి  మత్తు అనే దురాలోచనను రానియకుండ మనస్సు ను అదుపులో ఉంచుకోవాలన్నారు. అప్పుడే జీవితం బంగారు మయంగా ఉంటుందన్నారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామన్నారు. నాటుసారా, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తనిఖీల్లో ఎస్సై శ్యాం పటేల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.