29 August, 2026 | 5:26 PM

విష్ణు ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

29-08-2026 04:51 PM

నర్సాపూర్ ఆగస్టు 29: ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను విష్ణు ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠశాలలో వారం రోజులుగా వివిధ క్రీడా పోటీలు, నిర్వహించారు. క్రీడల ప్రాధాన్యత, విద్యార్థుల శారీరక–మానసిక వికాసంలో వాటి పాత్రను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. నాగజ్యోతి వివరించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆమె చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేష్‌, రమేష్‌తో పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం అభినందించింది