3 July, 2026 | 2:04 PM

సింధు ఈసారైనా!

28-05-2024 01:21 AM

నేటి నుంచి సింగపూర్ ఓపెన్

సింగపూర్: పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత ఏస్ షట్లర్లు మరో కీలక టోర్నీకి సన్నద్ధమవుతున్నారు. నేటి నుంచి సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత టాప్ షటర్లు బరిలోకి దిగుతున్నారు. తెలుగు తేజం పీవీ సింధు సహా కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ శెట్టి ఫేవరెట్స్‌గా బరిలోకి దిగనున్నారు. ఆదివారం ముగిసిన మలేషియా మాస్టర్స్ టోర్నీలో ఫైనల్ మెట్టుపై బోల్తా పడిన సింధూ ఈసారైనా టైటిల్ పట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో హోజ్మార్క్ (డెన్మార్క్)తో సింధు తలపడనుంది.