27-07-2025 10:34:45 PM
ఇండియా vs ఇంగ్లాండ్: ఓల్డ్ ట్రాఫోర్డ్(Old Trafford)లో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. 5వ రోజు ఆటలో భారత ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), వాషింగ్టన్ సుందర్(Washington Sundar)లు అద్భుత సెంచరీలు పూర్తి చేశారు. జడేజా(107), సుందర్(103) పరుగులతో చివరి వరకు అజేయంగా నిలిచారు. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన సెంచరీతో, భారత్ 311 పరుగుల లోటును అధిగమించి 5వ రోజు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. శుభ్‌మాన్ మరియు ఓపెనర్ కెఎల్ రాహుల్ 417 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. దీంతో కెఎల్ రాహుల్ 90 పరుగులు చేశారు. డ్రా అయిన ఫలితంతో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది.