12 July, 2026 | 2:16 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

45 కిలోల ఐఈడీ బాంబు నిర్వీర్యం

29-03-2025 12:00 AM

చర్ల, మార్చి 28: చర్ల మండల సరిహద్దులోని చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో 45 కిలోల ఐఈడీని భద్రతా బలగాలు శుక్రవారం నిర్వీర్యం చేశారు. చెర్పాల్- మార్గ్ మదర్స్ సెక్యూరిటీ పార్టీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఐఈడీ బాంబులను మావోయిస్టులు అమర్చారు.

ఈ బాంబులు కనిపెట్టిన భద్రతా బలగాలు చాకచక్యంగా నిర్వీర్యం చేశాయి. పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తున్నది. భద్రతాబలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు చెపుతున్నారు.