రూ 15 లక్షల సైబర్ మోసం
* సీబీఐ అధికారులమంటూ విశ్రాంత ఉద్యోగికి బెదిరింపులు
ఖమ్మం, డిసెంబర్ 7 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి విశ్రాంత ఉద్యోగి రూ.15 లక్షలు పోగొట్టుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా పట్ణణంలో ఉండే విశ్రాం త ఉద్యోగి ఊటుకూరు నరసింహారావుకు శుక్రవారం ఓ వీడియో కాల్ వచ్చింది. సీబీ ఐ అధికారులమని, ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి మాట్లాడుతున్నామని సైబర్ నేరగా ళ్లు చెప్పారు. ఐదు విమాన టిక్కెట్లు బుక్ చేశారని, ఎక్కడికి వెళ్తున్నారని, హవాలా వ్యాపారం చేస్తున్నట్లు తమకు సుప్రీంకోర్టు నుంచి సమన్లు వచ్చాయని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని నరసింహరావును బెదిరించారు.
అరెస్ట్ చేయకూడదంటే రూ.15 లక్షలు కోల్‌కత్తాలోని బంధన్ బ్యాంక్‌లోని రామా ఎంటర్‌ప్రైజెస్ ఖాతాకు జమ చేయాలని సూచించారు. దీంతో నేరగాళ్లు చెప్పిన ఖాతా కు నరసింహరావు రూ.15 లక్షలు బదిలీ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి మరో రూ.5 లక్షలు బదిలీ చేయాలని బెదిరించా రు. ఈలోపు ఇంటికి బంధువులు రావడంతో విషయం చెప్పగా.. మోసం జరిగిం దని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.




