10 July, 2026 | 5:02 AM

కలెక్టరేట్‌లో ఉద్యోగాల పేరిట భారీ మోసం

10-06-2024 05:57 PM

జగిత్యాల, విజయ క్రాంతి: జగిత్యాల కలెక్టరేట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.2.60 లక్షలు తీసుకొని తప్పించుకొని తిరుగుతున్న మోసగాళ్ల నుంచి కాపాడాలంటూ సోమవారం ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషకు పలువురు బాధితులు వేడుకున్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన నాగిశెట్టి మహేష్, పెద్దపల్లి  ప్రాంతానికి  చెందిన పిడుగు రవిందర్, రవి, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి లు తమకు కలెక్టరేట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి రూ.2.60 లక్షలు దండుకున్నట్లు రాధ, లక్ష్మీ, గణేష్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.