calender_icon.png 9 October, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు దగ్గు మందులపై నిషేధం

09-10-2025 01:50:47 AM

  1. రీలైఫ్, రెస్పిఫ్రెష్ కల్తీ!

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): రెండు దగ్గు మందులను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రీలైఫ్, రెస్పిఫ్రెష్ టీఆర్‌ను విక్రయించొద్దంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్టు గుర్తించారు. వీటిని గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీల ఔషధాలుగా అధికారులు వెల్లడించారు.

ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కోల్డ్రిఫ్ అనే దగ్గు మందు వాడటం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడినట్టు ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. కోల్డ్రిఫ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఔషధ నియంత్రణ విభాగం ఇప్పటికే ప్రకటించగా, తాజాగా మరో రెండు దగ్గు మందులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.