calender_icon.png 18 February, 2026 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచితంగా దుప్పట్ల పంపిణీ

18-02-2026 12:04:33 AM

ఖైరతాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ఐఐఎంసి కళాశాల కామర్స్ విభాగం సీనియర్ ప్యాకల్టీ సిఎన్ ప్రసాద్ ఇటీవల మృతిచెందారు. ఆయన జ్ఞాపకార్థంగా కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1, 2, సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వివిధ రకాల చికిత్సల కోసం రాష్ట్రం నలుదిక్కుల నుండి వచ్చే రోగులు, వారి బంధువుల సహాయార్థం పనిచేస్తున్న జనహిత సేవా ట్రస్ట్ వారికి 65 దుప్పట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఎం ఎస్ ఎస్ చైర్మన్  కూర రఘువీర్,  ఇ.రామకృష్ణ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ యూనిట్ 2 , ఎం. సత్యనారాయణ ప్రోగ్రాం ఆఫీసర్ యూనిట్ 1, సామాజిక బాధ్యత కమిటి కన్వీనర్ ఎన్. విజయానంద్ గౌడ్ పాల్గొన్నారు.