18-02-2026 12:05:12 AM
డివైడర్ కు ఢీకొని, అవతలి వైపు వెళ్తున్న కంటైనర్ ఢీకొన్న కారు
కారు దగ్ధం స్వల్ప గాయాలతో బయటపడిన కారు యజమాని
కామారెడ్డి, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఒక కారు 44వ జాతీయ రహదారిపై మంగళవారం బీభత్సం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజివాడి గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఒకరు డివైడర్ను ఢీకొట్టడంతో అవతల రోడ్డుపై వెళ్తున్న కంటైనర్ను ఢీకొనడoతో కారులో క్షణాల్లో మంటలు రేగాయి.
పోలీసుల కథనం ప్రకారం వివరాలీలా ఉన్నాయి. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు కారులో వెళ్తున్న హైదరాబాద్కు చెందిన రాహుల్ కు పద్మావాడి చౌరస్తా సమీపంలో నీ బ్రిడ్జి పైకి రాగా అదుపుతప్పి న కారు డివైడర్ కు ఢీ కొట్టింది. కొద్ది దూరం అలాగే డివైడర్ కు ఢీకొని ముందుకు వెళ్లి అవతల వైపు వెళ్తున్న కంటైనర్ కారు డి కొంది. ఈ క్రమంలో కారులో మంటలు వచ్చాయి.
కారులో ప్రయాణిస్తున్న రాహుల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే అతనిని అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో పోలీసులు కారులో వస్తున్న మంటలను అర్పి వేయించారు. ప్రస్తుతం రాహుల్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.