21-06-2025 02:15:41 AM
ఏపీఏడీ, హెలెన్ కిల్లర్స్ వారి సౌజన్యంతో..
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): ఏపీఏడీ, హెలెన్ కిల్లర్స్ వారి సౌజన్యంతో హయత్ నగర్ మండలం పెద్ద అంబర్‌పేట అబ్దుల్లాపూర్‌లోని ప్రత్యేక మోడల్ స్కూల్‌లో చెవిటి, మూగ విద్యార్థులకు ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందించబడుతుందని హెలెన్ కిల్లర్స్ అధినేత ఉమర్ ఖాన్ తెలియజేశారు. వినికిడి యంత్రాలు కూడా ఉచితంగా ఇవ్వబడతాయని చెప్పారు.
తల్లితండ్రులు తమ చెవిటి, మూగ విద్యార్థులను ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని కోరారు. కుటుంబానికి, సమాజానికి దేశానికి పనికివచ్చే బావి పౌరుడిగా చేయదలుచుకుంటే ఆరు సంవత్సరాలు పూర్తికాగానే పల్లలను తమ ప్రత్యేక పాఠశాలలో చేర్చాలని కోరారు.
అందుకు బర్త్‌సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్, సదరం సర్టిఫికెట్, ఆధార్ ఆధార్ కార్డు, నాలుగు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో వచ్చి సంప్రదించగలరని పేర్కొన్నారు. వివరాలకు 9912994390 నంబరులో సంప్రదించాలని చెప్పారు.