28-07-2025 12:00:00 AM
దోమకొండ, జూలై 27 ః కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిద్దిపేట కృష్ణ సాయి ఐ హాస్పిటల్, సెంటర్ ఫర్ సైట్ ఆధ్వర్యంలో బిబిపేట గ్రామానికి చెందిన డాక్టర్ బచ్చు కృష్ణమూర్తి, డాక్టర్ పెద్ది శ్రీపతి ఆధ్వర్యంలో 185 మంది కంటి పరీక్షలు జరిపి 54 మంది కి శస్త్ర చికిత్స లు అవసరమని తెలిపారు.
శస్త్ర చికిత్స అవసరమైన వారికి ఉచితముగా సిద్దిపేట లో కృష్ణ సాయి హాస్పిటల్ లో శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ సైట్ నిర్వాహకులు హరీష్, వాసవి క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం, మాజీ డిప్యూటీ గవర్నర్ విశ్వ ప్రసాద్, అంతర్జాతీయ కోఆర్డినేటర్ భాశెట్టి నాగేశ్వర్, నిలబైరయ్య, గాంధారి సిద్ధరాములు,
పెద్ది నాగేశ్వర్, హరి ప్రసాద్, శ్రీనివాస్, బచ్చు కృష్ణమూర్తి , డాక్టర్ శ్రీపతి లను శాలువాతో సన్మానించారు. ఉచిత కంటి చికిత్స శిబిరంలో 185 మందికి పరీక్షలు జరిపి 54 మంది శస్త్ర చికిత్సలకు అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణుడు గడిల విజయకుమార్, కిరణ్ కుమార్, మురికి శ్రీనివాస్ పాల్గొన్నారు.