28-07-2025 12:00:00 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఇస్నాపూర్ బీరప్ప దేవాలయం నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం
పటాన్ చెరు, జూలై 27 : దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్యెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. నియోజకర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఆదివారం ఇస్నాపూర్ మున్సిపల్ లో నూతనంగా నిర్మించిన బీరప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు సొంత నిధులతో 200లకు పైగా దేవాలయాలు నిర్మించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరిలో పరమత సహనం పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, దశరథ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులుపాల్గొన్నారు.