16 August, 2026 | 9:46 PM

పారమిత విద్యార్థుల ఉచిత ఆరోగ్య శిబిరం

16-08-2026 07:30 PM

ముకరంపుర, ఆగస్టు 16 (విజయక్రాంతి): నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థులు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఆదివారం అంబేద్కర్ స్టేడియంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు.

పాఠశాల సైన్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో, నర్సింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలో విద్యార్థులు స్టేడియానికి వచ్చిన వాకర్స్, క్రీడాకారులకు బీపీ, షుగర్, బిఎంఐ, తదితర ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాద్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోపికృష్ణ, కోఆర్డినేటర్లు నాగరాజు, రాము, సైన్స్ విభాగం ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు  పాల్గొన్నారు.