16 August, 2026 | 8:03 PM

అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో హన్మాజీపేట్ యువకుల సత్తా...

16-08-2026 07:31 PM

80 నిమిషాల పాటు నాన్ స్టాప్ రోలర్ స్కెటింగ్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన యువకులు...

బాన్సువాడ, ఆగస్టు 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ గ్రామానికి చెందిన కమ్మరి ఆనంద్, పర్షా వినయ్, వడ్ల శ్రావణ్ లు అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన 80 నిమిషాల నాన్‌స్టాప్ రోలర్ స్కేటింగ్ పోటీలో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు.

ఈ పోటీల్లో సుమారు 500కు పైగా పోటీదారులు పాల్గొనగా 80 నిమిషాల పాటు నిర్విరామంగా స్కేటింగ్ చేసి ముగ్గురు యువకులు గోల్డ్ మెడల్  సాధించారు. మారుమూల గ్రామమైన  హన్మాజీపేట్ గ్రామంలో పుట్టి గోల్డ్ మెడల్ సాధించడం గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ విజయం పట్ల గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు అభినందనలు తెలిపారు.