పోలీసులకు ఉచిత వైద్యశిబిరం
24-05-2026 12:00 AM
కూకట్‌పల్లి, మే 23 (విజయక్రాంతి): కేపీహెచ్‌బీ కాలనీ జేఎన్టీయూ క్యాంపస్‌లో పోలీసులకు మాదాపూర్ సింధు ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో కేపీహెచ్‌బీ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సుమారు 90 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో పోలీస్ సిబ్బందికి బీపీ, షుగర్, రక్త పరీక్షలు, నేత్ర పరీక్షలు, బాడీ మాస్ ఇండెక్స్, ఈసీజీతో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.






