13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వెల్గి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

27-03-2026 06:05 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలం రింగారిట్ గ్రామ పంచాయతీ పరిధిలోని వెల్గి గ్రామంలో శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వ హించారు. గ్రామంలో 16 మం దికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా వాంకిడి ఆరోగ్య విస్తరణ అధికారి రవిదాస్ మాట్లాడుతూ...  గర్భిణీలు ప్రతి నెల క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు ఉద యం 10 గంటలలోపు ఇంటికి చేరుకోవాలనిసూచించారు.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త కమల, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.