6 April, 2026 | 8:22 PM

ధర్మరక్షణకు ముందుకు రావాలి

06-04-2026 06:37 PM

కుభీర్: దేశంలో ధర్మరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు కదలని ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పిలుపునిచ్చారు. బుధవారం కుబీర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు అధ్యక్షులు చిమ్మన్ అరవింద్, పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమలానంద భారతి స్వామి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

ఈ సమ్మేళనంలో గోమాత పూజ అనంతరం సామూహిక కుంకుమార్చన, హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు స్వామివారి ప్రసంగం ఉంటుందని వివరించారు. ఈ సమ్మేళనంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బొమ్మిడి మల్లేష్, ఏశాల దత్తాత్రి, పడిపెల్లి గంగాధర్, రోహిత్ ధర్మసేన, లింగన్న, బోయిడి అభిషేక్, గోనె విట్టల్, ఆయా కుల సంఘాల పెద్దలు, నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.