29 May, 2026 | 8:35 PM

ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యలో ఉచిత వైద్య పరీక్షలు

29-05-2026 04:07 PM

బోధన్:మే 29 (విజయ క్రాంతి): బోధన్ పట్టణ కేంద్రంలో ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యలో శుక్రవారం ఉచిత వైద్య పరీక్షలను ముత్తూట్ ఫైనాన్స్ ఎదుట ఏర్పాటు చేశారు. స్నేహ శ్రీయ మొబైల్ లేబలేటరి సర్వీస్ ద్వారా జీవనశైలి వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు రక్తపోటు, షుగర్, కొలస్ట్రాల్, క్రియాటినిస్, యూరిన్ షుగర్, యూరిన్ అల్బుమిన్, హెచ్ బి  ఏజీ పరీక్షలను ఉచితంగా చేశారు. 120 మందికి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తూట్ ఫైనాన్స్ రీజినల్ మేనేజర్ మహేష్ బాబు, మార్కెటింగ్ మేనేజర్ రఘు, క్లస్టర్ ఇంచార్జీ షాదుల్, బోధన్ బ్రాంచ్ మేనేజర్ నవీన్ తదితరులు ఉన్నారు.