calender_icon.png 30 June, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివ్వెంలలో ఉచిత మెగా వైద్య శిబిరం

30-06-2025 12:16:32 AM

చివ్వెంల, జూన్ 29: మండల కేంద్రంలోనీ జిల్లా పరిషత్ హై స్కూల్ లో లంబాడివిద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు దారవత్ బాలు నాయక్, ఏ ఐ బి ఎస్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి బానోత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో కిమ్స్, సన్ షైన్ హాస్పిటల్, టీం విమలాకర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారం తో ఉచిత మెగా వైద్య శిబిరం  నిర్వహించారు.

ఈ సందర్భంగా అల్ట్రాసౌండ్ అబడోమెన్, యూజీఐ ఎండోస్కోపి, ప్రాక్టోస్కోపి, ఇసీజీ, 2డి-ఎకో, సీ బీ పీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఆర్ బి ఎస్, లిపిడ్ ప్రొఫైల్, బీపీ, షుగర్ లతో పాటు 14 రకాల స్క్రీనింగ్ టెస్టులు చేశారు. తదుపరి గ్యాస్ట్రాలజీ డాక్టర్ విమలాకర్ రెడ్డి మాట్లాడుతూ సుమారు వెయ్యి మందికి ఉచిత వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమం లో కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, బీజేపీ మండల అధ్యక్షులు మాదారపు అనిల్ రావు, మంగత నాయక్, బానోత్ లింగ నాయక్ రిచ్ ఇండియా ఫౌండర్ ధరవత్ రేణుక లాకు నాయక్, మాజీ ఎంపీటీసీ సాగర్ నాయక్ లంబాడి విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు హరీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు