18-01-2026 08:23:39 PM
- అఖిల రాజ్ ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ పుట్ట రాజు
సిద్దిపేట: అఖిల రాజ్ ఫౌండేషన్, ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రముఖ అమెరికా ప్లాస్టిక్ సర్జరీ వైద్యులచే ఉచిత సర్జరీ శిబిరమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అఖిల రాజ్ ఫౌండేషన్ కో- ఆర్డినేటర్ పుట్ట రాజు, మండల అధ్యక్షులు సొక్కం స్వామి అన్నారు. ఆదివారం రాయపోల్ మండలం కేంద్రంలో అఖిల రాజ్ ఫౌండేషన్ మండల కమిటీని ఎన్నుకొని అనంతరం ఉచిత ప్లాస్టిక్ సర్జరీ గోడపత్రిక విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అఖిల రాజ్ ఫౌండేషన్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రముఖ అమెరికా ప్లాస్టిక్ సర్జరీ వైద్యుల చేత ఉచిత సర్జరీ శిబిరం జనవరి 26 నుంచి ఫిబ్రవరి 4 వరకు డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ హాస్పిటల్, సీతారాం బాగ్, ఓల్డ్ మల్లేపల్లి, హైదరాబాద్ నందు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరంలో గ్రహణ మొర్రి, కరెంట్ షాక్, అగ్ని ప్రమాదంలో కాలిన గాయాలు మరియు ఇతర కారణాలతో ఇబ్బంది పడుతున్న వారికి లక్షల ఖరీదైన సర్జరీ ఉచితంగా చేయడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం 9949691182, 9908010610 ఫోన్ నంబర్ లో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
అంతకుముందు అఖిల రాజ్ ఫౌండేషన్ రాయపోల్ మండలం కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులు సొక్కం స్వామి, ఉపాధ్యక్షులు దాతర్ పల్లి భాస్కర్, బ్యాగరి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి మంకిడి నాగరాజు, కార్యదర్శి తూర్పు శ్రవణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి బయ్యగాని శ్రీకాంత్, ఆర్గనైజర్ బ్యాగర్ నవీన్, కోశాధికారి సొక్కం శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జ్ పుట్ట భాను ప్రసాద్, తలారి చాణక్య, బ్యాగరి భరత్, కార్యవర్గ సభ్యులు పరశురాములు, పంబాల దేవరాజ్, మంకిడి నవీన్, కళ్లెం కిరణ్ కుమార్, తోకల రామకృష్ణ, లింగం, రాంపల్లి సతీష్, శ్రీకాంత్, నాగరాజు, విష్ణు, నర్సింగరావు లను ఏకగ్రీవ ఎన్నుకున్నారు.