calender_icon.png 18 January, 2026 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరుదీక్షకు పిలుపు

18-01-2026 07:32:40 PM

సిద్దిపేట రూరల్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 20న హైదరాబాద్ ఇందిరా పార్క్ చౌక్ వద్ద నిర్వహించనున్న కళాకారుల పోరుదీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర కార్యదర్శి కుంచం శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.

గోషికట్టి, గొంగడిసి, డప్పు, పాటల ద్వారా రాష్ట్ర సాధనలో పోరాడిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారధిలో వెంటనే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నాకు కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.