calender_icon.png 23 August, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పాలిసెట్ ఉచిత శిక్షణ..

08-04-2025 05:06:30 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో టీఎస్ పాలిసెట్ 2025 పరీక్షకు ఉచిత బోధన తరగతులు నిర్వహిస్తున్నామని సింగరేణి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం తెలిపారు. పట్టణంలోని పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత శిక్షణ తరగతులు ఏప్రిల్ 10 నుండి మే 10 వరకు సింగరేణి పాఠశాలల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు.

2025లో పదవ తరగతి పూర్తి చేసిన సింగరేణి పాఠశాలతో పాటు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకున్న సింగరేణి ఉద్యోగుల పిల్లలు అర్హులని ఆయన స్పష్టం చేశారు. పాలిసెట్ అర్హత పరీక్ష ద్వారా విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి విభాగాల్లో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు సమీపంలోని సింగరేణి పాఠశాల ప్రధానోపాధ్యాయులను లేదా 4 98492 15692 నెంబర్ లో సంప్రదించాలని కోరారు.