calender_icon.png 23 August, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మంథని డివిజన్‌లో యూరియా కొరత లేదు

23-08-2025 11:06:44 AM

కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి

మంథని, (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సహకారంతో మంథని డివిజన్ లో యూరియా కొరత లేదని కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి(Surender Reddy) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంథని డివిజన్ లోని ప్రాథమిక సహకార సంఘాలలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని సురేందర్ రెడ్డి తెలిపారు.‌ యూరియా బస్తాల కోసం వచ్చే రైతులు పట్టాదారు పాసుపుస్తకం ఆధార్ జిరాక్స్ పత్రాలను తమ వెంట తీసుకురావాలని కోరారు. 

మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో రైతులకు యూరియా(Urea) కోసం  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా నిల్వలు సరిపడ ఉన్నాయన్నారు. రైతులు ఏమాత్రం అధైర్య పడవద్దని, రైతులకు యూరియా కొరత లేకుండా వ్యవసాయ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కొందరు కావాలని యూరియా నిల్వలు లేవని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, యూరియా కావలసిన రైతులు సహకార సంఘం లో సంప్రదించగలరని కోరారు. యూరియా మంథని నుంచి అక్రమంగా తరలిపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.