28 July, 2026 | 12:56 AM

మై భారత్ పోర్టల్‌లో ఉచిత రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం

28-07-2026 12:00 AM

జూలై 1 నుండి ఆగస్టు 15 వరకు అవకాశం 

యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపు 

భూపాలపల్లి టౌన్, జులై 27 (విజయ క్రాంతి): కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మై భారత్ డిజిటల్ పోర్టల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని యువతీ యువకులు, విద్యార్థులు, క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పోరట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జూలై 1 నుండి ఆగస్టు 15 వరకు ఈ ప్రత్యేక ఉచిత రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహించబడుతుందని తెలిపారు. వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో యువతను భాగస్వామ్యం చేయడానికి ఈ పోర్టల్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని, పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పలు ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.

అందులో నైపుణ్యాభివృద్ధి శిక్షణలో భాగముగా ఉచిత స్కిల్ డెవలప్మెంట్ లెర్నింగ్ అవకాశాలు. జాతీయ స్థాయి ఈవెంట్లలో భాగముగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్లలో పాల్గొనే అవకాశం. క్రీడా పోటీలలో భాగముగా బ్లాక్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోరట్స్ మీట్లలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

జిల్లాలోని 15 నుండి 29 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు ఎవరైనా తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా mybharat.gov.in అధికారిక వ్బుసైట్ను సందర్శించి కేవలం 5 నిమిషాల్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ లు, ఫిజికల్ డైరెక్టర్లు,వ్యాయామ ఉపాధ్యాయులు తమ పరిధిలోని విద్యార్థులందరికి ఈ పోర్ట్ప అవగాహన కల్పించి వంద శాతం రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని కోరారు.

గ్రామీణ యువత, నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లు, క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు జిల్లా మై భారత్ కేంద్రం ప్రతినిధి శ్రీ భుక్యా సంజీవ్ ను 8074664539 నెంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు.