శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ప్రజావాణి
ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలకు ఆదేశాలు
శేరిలింగంపల్లి, జూలై 27 (విజయక్రాం తి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఐఏఎస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పౌరులు తమ సమస్యలను నేరుగా తెలియజేశారు.పురపాలక సేవలకు సంబంధించిన వివిధ అంశాలపై పలువురు ప్రజలు వినతులు సమర్పించారు. అందుకున్న ప్రతి ఫిర్యాదునూ క్షుణ్ణంగా పరిశీలిం చిన అధికారులు, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాల ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా ప్రజాభిముఖ, పారదర్శ క పాలనను అందించడమే మా ప్రధాన లక్ష్యం. ఈ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఆ లక్ష్యాన్ని మరోసారి నొక్కి చెబుతున్నాం అని జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఐఏఎస్ పేర్కొన్నారు.కార్యక్రమంలో జోనల్ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజల సమస్యలపై చర్చించారు.






