18-07-2025 12:00:00 AM
కొత్తగూడెం, జులై 17 (విజయ క్రాంతి)జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ స్ఫూర్తితో జిల్లా వ్యా ప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు విత్తనాలను సేకరించారు. కొత్తగూడెం మం డల పరిధిలో సేకరించిన సుమారు 40 కేజీల గా నుగ, వేప, టేకు తదితర గింజలను మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రభు దయాల్ నేతృత్వంలో ఆనందఖని పాఠశాలకు చెందిన ఎన్ సి సి విద్యార్థులు రామవరం రిజర్వు అటవీ ప్రాంతంలో నేడు విరివిగా జల్లారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎన్ సీ సీ ఇన్చార్జి ఆఫీసర్ వీరు, ప్రధానోపాధ్యాయులు లక్ష్మి , ఉపాధ్యాయులు రమేష్, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.