calender_icon.png 1 May, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జామియా మిలియాలో సివిల్స్ కు ఉచిత శిక్షణ

29-04-2025 10:30:00 PM

2024 ఫలితాలలో 32 మంది ఎన్నిక..

మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అవకాశం...

గడువు తేదీ మే 28..

మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): 2026లో జరగనున్న యూపీఎస్సీ, సివిల్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులకు ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వారు అందిస్తున్న ఉచిత శిక్షణను పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా(MD Yakub Pasha) మంగళవారం  ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ  ఉచిత శిక్షణ పొందేందుకు గాను విశ్వవిద్యాలయం వారు నిర్వహించే అర్హత పరీక్షలో మెరిట్ సాధించిన వారికి  ఒక సంవత్సరం పాటు ఉచిత శిక్షణతో భోజన, వసతి  ఏసీ సౌకర్యాలతో కల్పించటం జరుగుతుందన్నారు. యూపీఎస్సీ ఈ ఏడాది ప్రకటించిన ఫలితాల్లో జామియా మిలియాలో శిక్షణ పొందిన 32 మంది అభ్యర్ధులు సత్తాచాటి పలు సర్వీసులలో  నియమించబడ్డారన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు తమ వివరాలను https://admission.jmi.ac.in అనే వెబ్‌సైట్ నందు రూ.1200 పరీక్ష రుసుము చెల్లించాలని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 8520860785 అనే నంబర్ కు సంప్రదించాలని అన్నారు.