25 April, 2026 | 6:42 PM

చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ

25-04-2026 05:08 PM

ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్

మహబూబ్‌నగర్ టౌన్: ఫస్ట్ కార్యాలయంలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న మహిళలు తమ చిన్నారులను వెంట తీసుకుని వస్తున్న నేపథ్యంలో చిన్నారుల కోసం వేసవి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి  సూచనల మేరకు వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా చిన్నారులకు సాంప్రదాయ నృత్యం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు.

ఈ శిక్షణను నిష్ణాతులైన శిక్షకుల ద్వారా నిర్వహిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తమ శిక్షణను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించగలుగుతున్నారు. అదే సమయంలో చిన్నారులు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా మారిందని తెలిపారు.

చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించడం, సాంప్రదాయ కళలపై ఆసక్తి కలిగించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న మహిళలు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం తీసుకుంటున్న ఈ చర్యలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు