25 April, 2026 | 6:23 PM

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్

25-04-2026 05:06 PM

 వేములపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బి ఆర్ ఎస్ జిల్లా నాయకుడు కట్ట మల్లేష్ గౌడ్ అన్నారు. శనివారం శెట్టిపాలెం గ్రామంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబరిచిన గ్రామానికి చెందిన విద్యార్థులను సర్పంచ్ పెదపంగా సైదులతో కలిసి ఘనంగా సన్మానించి మాట్లాడారు. గ్రామానికి చెందిన విద్యార్థులు బంటు మధు ఎంపీసీలో 994, బండారు హరిణి బైపీసీలో 981, బంటు మని సాయి ఎంపీసీలో 964,దుండిగాళ్ల చరణ్ తేజ్ 951,కోలా ఐశ్వర్య ఎంపీసీలో 944, సూరేపల్లి కీర్తన సిజిటిలో 907, అమ్మురాది ఇందు ఎంపీసీలో 863 బంటు మానస ఎంపీసీలో 853 బంటు శ్రావణి ఎంపీసీలో 817, బంటు శివ సాయి 81 మార్కులు సాధించి గ్రామానికి వన్నె తేవడంతో పాటు తోటి విద్యార్థులకు, రాబోయే తరాల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారన్నారు.

ప్రతి సంవత్సరం ఇంటర్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన గ్రామ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తుందన్నారు. విద్యార్థులు పై చదువులు చదివి ఉన్నత జాబులను సాధించి తమ తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మజ్జికపు సుధాకర్ రెడ్డి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ రాజగోపాల్ రావు, వార్డు మెంబర్లు బంటు శ్రీను, దుర్గమ్మ,వెంకట్ రెడ్డి,కే వేణు,సిహెచ్ నాగయ్య, శ్రీధర్, కే నగేష్, అశోక్,వీరమల్లు, సంపత్,టీ సైదిరెడ్డి, చంద్రయ్య,నవీన్, రుషి,కొండయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.