22-10-2025 06:11:46 PM
కోదాడ: కోదాడ పట్టణంలోని ఉర్దూఘర్ షాది ఖానాలో స్వాతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ జయంతి వేడుకలు పట్టణ ఉపాధ్యక్షులు అలీ భాయ్, జహీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోదాడ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ డివిజన్ అధ్యక్షులు ఎస్కే భాజన్, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ఎస్దాని, మాజీ కౌన్సిలర్లు కాజా, ముస్లిం మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాబా మండల అధ్యక్షుడు ఖలీల్, షఫీ కిసాన్ సెల్ అధ్యక్షులు ముస్తఫా మైనారిటీ ఉపాధ్యక్షులు కాసిం భాయ్ ఎంఐఎం పార్టీ నాయకులు రఫీ, దాదావలి మాజీ గ్రంథాలయ చైర్మన్ రహీం మాజీ కో ఆప్షన్ బాగ్దాద్ తదితరులు పాల్గొన్నారు.