16 April, 2026 | 10:46 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

24న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా

22-10-2025 06:15 PM

అచ్చంపేట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24న హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని నాగర్ కర్నూల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ నిరంజన్ ముదిరాజ్ తెలిపారు. ధర్నాలో మాజీ ఐఏఎస్ చిరంజీవులు, జస్టిస్ ఈశ్వరయ్య, డా.విశారదన్ మహారాజ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ధర్నాలో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ సాయి మహారాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పు సురేష్, రవి, శ్రీధర్, లింగం, వీరయ్యలు పాల్గొన్నారు.