calender_icon.png 22 January, 2026 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రముఖ నటులు యష్, రాధికలతో ఫ్రీడం ఆయిల్ ‘కోర్టు రూమ్’ క్యాంపెయిన్

20-11-2024 12:00:00 AM

హైదరాబాద్, నవంబర్ 19: ఫ్రీడం రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ స్వచ్ఛతను తెలియపరుస్తూ ప్రముఖ నటులు యష్, రాధికలతో కొత్తగా ‘కోర్టు రూమ్’ యాడ్ క్యాంపెయిన్‌ను ఫ్రీడం రేంజ్ వంటనూనెలు ఉత్పత్తి చేసే జెమిని ఎడిబుల్స్ విడుదల చేసింది. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యాన్ని అందిస్తుందని, అన్ని సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌లోనూ ఒకేరీతిలో స్వచ్ఛత ఉండదని, కల్తీ నూనెల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఈ కాంపెయిన్‌ను రూపొందించినట్లు కంపెనీ ప్రకటన తెలిపింది.

తాము నమ్మకానికి, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తామని, తమ కోర్టు రూమ్ క్యాంపెయిన్ ద్వారా వినియోగదారులకు సరైన వంటనూనెల పట్ల అవగాహన పెంచాలన్నది లక్ష్యమని జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర రెడ్డి వివరించారు.