24 June, 2026 | 10:08 PM

హెలెన్ కెల్లర్స్ కాలేజీలో ఫ్రెషర్స్ డే

13-09-2025 03:36 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): మూగ విద్యార్థులకు విద్యను అందించే హెలెన్ కెల్లర్స్ డిగ్రీ కాలేజీ ఫ్రెషర్స్ డే సెలెబ్రేషన్స్ శుక్రవారం జి. కే సరస్వతి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా జానబ్ సయ్యద్ అజీజ్ పాషా, మాజీ పార్లమెంట్ సభ్యుడు (రాజ్యసభ) ప్రసంగిస్తూ.. లయన్ పఠాన్ ఉమ్మర్ ఖాన్ బధిర విద్యార్థులకు ప్రీ స్కూల్ నుండి బి.కామ్ వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి వివరించారు. స్పెషల్ గెస్ట్ ప్రసన్నకాంత్ కంప్యూటర్ ల్యాబ్ నిప్రారంభించి బధిర విద్యార్థులు అవసరం అయిన సహా యం చేస్తాను అని చెప్పారు.

శ్రీధర్ కులకర్ణి బధిర విద్యార్థులు మంచిగా చదువు కోవాలని చెప్పారు. హెలెన్ కెల్లర్ ఫౌండర్, చైర్మన్ లయన్ పఠాన్ ఉమ్మర్ ఖాన్ మాట్లాడుతూ.. “తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక డిగ్రీ కాలేజీ బధిర విద్యార్థులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు సకలాంగులకు తీసిపోరు” అని అన్నారు. బి కామ్ ప్రిన్సిపాల్ లయన్ జాజుల అంజయ్య.. హెలెన్ కెల్లర్స్ కాలేజీలో చేరిన బి కామ్ ఫ్రెషర్స్‌కి ధన్యవాదములు తెలియజేశారు. బధిర విద్యార్థుల క్యాట్ వాక్ లో పి వైష్ణవి, అబ్దుల్ ఖలీం ప్రైజ్ గెలిచారు.