13-09-2025 03:37:01 AM
దండేపల్లి, సెప్టెంబర్ 12: తాళ్లపెట్ రేంజ్‌లోని లింగాపూర్ బీట్ పరిధిలో అడవి సిబ్బందిపై ఆక్రమణదారులు దాడి చేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. నాలుగైదు నెలల నుంచి దమ్మనపేట, మా మిడిగూడలలో ఆదివాసి గిరిజనులు తాత్కాలిక షెడ్లు వేసుకొని ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా అటవి అధికారులు వారిని కాళీ చెయ్యాలని చెబుతూన్న వారు నిరాకరిస్తు వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అక్కడికి వెళ్లిన అటవీ సిబ్బంది(ఎఫ్‌ఎస్‌ఓ బాలకృష్ణ, ఎఫ్‌బీవో పరమేశ్వర్, బేస్ క్యాంప్ వాచర్ రాజేందర్)పై కళ్లలో కారం చల్లి, కత్తులు, గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి బెదిరించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు సంబంధిత అధికారులు, పోలీసులు విచారణ అనంతరమే తెలియనుంది.
ఉద్దేశపూర్వకంగానే దాడి: సుష్మ, అటవీ రేంజ్ అధికారి తాళ్లపేట
అటవీ సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగానే దమ్మన్నపేట, మామిడిగూడ ప్రాంతాల ఆక్రమణదారులు విధులు నిర్వహిస్తున్న ముగ్గు రు అధికారులపై దాడి చేసి గాయపరిచారు. నిందితులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం.