13-09-2025 03:35:21 AM
- సిగ్నల్ లేక అవస్థలు పడుతున్న ఏఈఓలు
కుభీర్, సెప్టెంబర్ 12: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా, వరదల వల్ల నష్టపోయిన పంటలను సర్వే చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించడంతో నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సర్వేను చేపడుతున్నారు. ఈ క్రమం లో మండలంలోని పలు మారుమూల గ్రా మాలకు నెట్‌వర్క్ సమస్య కొన్నేళ్లుగా వేధి స్తూ వస్తుంది. దీంతో మండలంలోని సిరిపెల్లి నెం1, 2, 3 గిరిజన తండాలతో పాటు ఫకీర్ నాయక్ తండాలో రెండు రోజులుగా సర్వేకు వచ్చిన ఏఈఓలకు నెట్‌వర్క్ అందక ఫీల్డ్ సర్వేలో ఇబ్బందులు ఎదురవుతున్నా యి.
తాజాగా శుక్రవారం ఫకీర్ నాయక్ తండాలో పంట నష్టం పై పీలు సర్వేను నిర్వహిస్తున్న ఏఈఓ జగదీష్ గిరిజన తండాలోని పలు పశువుల పాకలపై నిచ్చెన సాయంతో ఎక్కి సర్వేను నిర్వహిస్తున్నప్పటికీ గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో అధికారు లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గాను బీఎస్‌ఎన్‌ఎల్ గత కొద్ది రోజుల క్రితం టవర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ కొత్తగా తీసుకున్న మొబైల్ ఫోన్‌లకు మాత్రమే తక్కువ రేంజ్‌లో నెట్ వర్క్ అందుతోంది.
ఇక పాత ఫోన్లకు అసలు నెట్‌వర్క్ రావడం లేదు. గిరిజనులు దూర ప్రాంతంలో చదువుకుంటున్న తమ పిల్లలతో, బంధువులతో మాట్లాడాలన్నా గుట్టమీదికి వెళ్లాలి లేదా మిషన్ భగీరథ ట్యాంక్ పైకి వెళ్లి మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఈ గిరిజన గ్రామాలకు నెట్‌వర్క్ సౌకర్యం కల్పించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతూ వస్తున్నారు.