25 July, 2026 | 2:43 AM

‘ఫ్రైడే డ్రై డే’ తనిఖీ

25-07-2026 02:13 AM

భూత్పూర్, జులై 24  : అమిస్తాపూర్‌లో ఆశలు, ఏఎన్‌ఎమ్‌లు నిర్వహిస్తున్న ‘ఫ్రై డే -డ్రై డే కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో శ్రీనివా సులు ఆకస్మికంగా  తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నిలిచిన నీ టిని తొలగించాలన్నారు.  ప్రతి వారం ప్రజ లు, ఆశా కార్యకర్తలు,  మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి శివకాంత్, భూత్పూర్ వైద్యాధికారి అబ్దుల్ రబ్, హన్మంతు, ఆశ కార్యకర్తలున్నారు.