25 July, 2026 | 2:50 AM

వనపర్తిలో ఎఐవైఎఫ్ 3వ జిల్లా మహాసభలు

25-07-2026 02:14 AM

వనపర్తి టౌన్, జూలై 24 : అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) వనపర్తి జిల్లా 3వ మహాసభలు శుక్రవారం సీపీఐ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మహేష్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న ప్రభుత్వ విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం, ప్రైవేటీకరణ, విద్యా రంగ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.  సెప్టెంబర్లో యాదాద్రి జిల్లాలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎఐవైఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు