24 August, 2026 | 8:30 AM

దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం

22-05-2026 07:07 PM

దోమల నివారణపై ఫ్రైడే_ డ్రైడే కార్యక్రమం

కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత

జవహర్ నగర్, మే 22 (విజయక్రాంతి): దోమ కాటు వ్యాధుల పట్ల ప్రజలకు అప్రమత్తత అవసరమని చికిత్స కంటే నివారనే ఉత్తమ మార్గమని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్ వసంత పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ లో శుక్రవారం మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత ఆధ్వర్యంలో ఎంటమాలజీ విభాగం వారు దోమల నివారణ పై అవగాహన (ఫ్రైడే_ డ్రైడే) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత హాజరై మాట్లాడుతూ... వ్యాధుల పట్ల చికిత్స కంటే నివారణే ముఖ్యమని దోమల నివారణకై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఇంటి ఆవరణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి మన ప్రాంతంలో ఉన్న దోమలను అరికట్టవచ్చునని ఇంటి ఆవరణ పరిశుభ్రత దోమల నివారణకు సరైన మార్గమన్నారు.

దోమల నివారణకు దోమతెరల వంటి ఉత్తమ సాధనాలు ఉపయోగించి దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. చికిత్స కంటే నివారణే ఉత్తమ మార్గమని చెప్పినట్లు దోమ పుట్టకుండా దోమ పుట్టకుండా ప్రత్యేక పద్ధతులలో దోమల నివారణ పై అవగాహన పెంచుకోవడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ భాస్కర్ వార్డు ఎంటమాలజీ సూపర్వైజర్లు శ్రీనివాస్ స్వామి కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.