22 May, 2026 | 8:00 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

22-05-2026 07:22 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండల కేంద్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని పీఈటీలు వై. ముక్కంటి, జయ, సీనియర్ క్రీడాకారులు చింతల నాగయ్య, తుంగం వెంకటయ్య, సిద్దిక్ తదితరులు 15 రోజులుగా స్థానిక గురుకుల విద్యాలయంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. సాగర్ సిమెంట్స్ యాజమాన్యం, కొందరి దాతల సహకారంతో  కార్యక్రమం 30వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలియజేశారు.

విద్యార్థులు సెల్ ఫోన్, టీవీలు చూస్తూ వేసవి సెలవుల్లో కాలయాపన చేయకుండా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమానికి దాతలు ఇంకా ముందుకు వస్తే ఎక్కువమంది పిల్లలకు తర్ఫీదును ఇవ్వడం జరుగుతుందని వారికి మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, ఫ్రూట్స్ దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విషయాన్ని గమనించి మీ పిల్లలను శిక్షణ శిబిరంలో జాయిన్ చేయించాలి.

ఇప్పటివరకు సహకరించిన దాతలు 20 వేలు విలువైన ఆట వస్తువు లను జీఎం హేమంత్, బక్కమంతులగూడెం సర్పంచి ఇరిగెల నరేందర్ రెడ్డి రూ.25 వేల విలువైన టీ-షర్టులు  అందజేయడం జరిగిందని, కాల్వపల్లి తండా సర్పంచ్ మాలోతు సక్రు నాయక్ ఔత్సాహికుల శిక్షణ పూర్తయ్యే వరకు వారికి అల్పా హారాన్ని అందజేస్తున్నారని,దాతలుగా సహకారం అందించిన వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.