పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు
22-05-2026 07:16 PM
చివ్వెంల: చివ్వెంల పీఏసీఎస్ చైర్మన్‌గా మారినేని సుధీర్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో డైరెక్టర్లు, సిబ్బంది సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోర్టు ఆదేశాల మేరకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. గత ఏడు సంవత్సరాలుగా మండల రైతులకు సొసైటీ తరఫున సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
రైతులు వరి కొయ్యకాళ్లు కాల్చడం వల్ల భూమిలోని పోషకాలు నశించి పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని అన్నారు. అలాగే కొయ్యకాళ్లు కాల్చడం వల్ల పక్కనున్న రైతుల బోరు మోటార్లు, విద్యుత్ వైర్లు దగ్ధమై నష్టాలు సంభవిస్తున్నాయని సూచించారు. రైతులకు అవసరమైన యూరియా, విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.






