24 August, 2026 | 10:35 AM

వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్

22-05-2026 07:13 PM

చేగుంట: రాష్ట్రంలోని 1.11 కోట్ల మందికి పైగా కార్మికులకు మేలు జరిగేలా వేతనాల పెంపు నిర్ణయం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం చేగుంట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, దుబ్బాక ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి  చిత్రపటాలకు కార్మికులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి మండలాధ్యక్షుడు  పాలాభిషేకం నిర్వహించారు.