కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి
- బీజేపీలో మాత్రమే ఇది సాధ్యమైంది
భాగ్యలక్ష్మి ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ చేస్తాం
అమ్మవారి దయవల్లే బీజేపీ 8 ఎంపీ సీట్లు
తెలంగాణ ప్రజలకు సెల్యూట్
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’గా మారుస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలతో కలిసి గురువారం సాయంత్రం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దయవల్లే ఈరోజు బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. ఈ విషయంలో కార్యకర్తల కష్టం మరువలేనిదని పేర్కొన్నారు. బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేశారు.
తనకు కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పా రు. కార్పొరేటర్ కేంద్ర మంత్రి కావొచ్చని, చాయ్ వాలా ప్రధాని కావొచ్చని నిరూపించిన ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. బీజేపీని తెలంగాణలో తిరుగులేని శక్తిగా మార్చి అధికారంలోకి తీసుకొచ్చేదాకా పోరాడతానని తెలిపారు.
బొగ్గు ఉత్పత్తిని పెంచాలి అధికారులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): బొగ్గు గనుల్లో కార్యకలాపాలను వేగవంతం చేయాలని, ఉత్పతి పెంచాలని కేంద్ర గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వాణిజ్య బొగ్గు బ్లాకుల నిర్వహణపై గనుల మంత్రిత్వ శాఖ అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. కేటాయించిన బొగ్గు గనుల్లో వీలైనంత త్వరగా తవ్వకాలు జరిపేందుకు వీలుగా సమస్యల సత్వరమే పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఇందుకోసం రాష్ర్ట ప్రభుత్వాలు, పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖతో సహా ఉత్పత్తిదారులను సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలన్నారు. బొ గ్గు ఉత్పత్తిలో ఆత్మనిర్భరత సాధించేందుకు దిగుమతులను తగ్గించుకోవడానికి కృషి చే యాలన్నారు.
బొగ్గు అధిక ఉత్పత్తి అవసరాన్ని ఎత్తిచూపుతూ రాష్ర్టస్థాయిలో సంస్థాగ త పటిష్ఠతకు తోడ్పాటు అందించాలని మంత్రి ఆదేశించారు. కేటాయించిన బొగ్గు గనులు వీలైనంత త్వరగా పని చేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇప్పటివరకు బొగ్గు మంత్రిత్వ శాఖ 575 టన్నుల గరిష్ఠ స్థాయి సామర్థ్యంతో 161 బొగ్గు గనులను కేటాయించిందని కిషన్‌రెడ్డి పేర్కొ న్నారు. అందులో 58 గనులు తెరవడానికి ఇప్పటికే అనుమతి లభించగా వాటిలో 54 గనుల్లో ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతోందన్నారు. గత సంవత్సరం ఈ గనులు మొత్తం 147 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశాయన్ని చెప్పారు. దేశం మొత్తం బొగ్గు ఉత్పత్తిలో ఇది 15 శాతమని మంత్రి వెల్లడించారు. శుక్రవారం 10వ రౌండ్ గనుల వేలం నిర్వహిం చనున్న నేపథ్యంలో 11వ రౌండ్ వేలంలో ఎక్కువ గనులు అర్రాజు జాబితాలో ఉండేలా చూడాలని అధికారులను మంత్రి అదేశించారు. ఇందుకోసం మరిన్ని బ్లాకుల అన్వేషణ ను వేగవంతం చేయాలని సూచించారు.






