17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కన్నవారి కోసం డెన్మార్క్ నుంచి ఆదిలాబాద్‌కు..

01-02-2026 03:14 AM

దత్తత తీసుకున్న కొడుకు తల్లిదండ్రుల కోసం వెతుకులాట

ఆదిలాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): తమ దత్త పుత్రుడి మూలాలను వెతుక్కుంటూ డెన్మార్క్‌కు చెందిన లూయి, రాస్మస్ దంపతు లు శనివారం ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. తమ కొడుకు తన కన్నవాళ్ళు ఎవరు అని అడిగిన ప్రశ్న ఆ దంపతులను కదిలించింది. శని వారం ఆడాఫ్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధి, న్యాయవాది అంజలి పవార్‌తో కలిసి స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత 9 ఏళ్ల క్రితం రెండు నెలల వయసు ఉన్న బాలున్ని కన్నవారు రిమ్స్ ఆసుపత్రిలో వదిలిపెట్టారు.

బాబు రెం డు చేతుల వేళ్లు వంకరగా ఉన్నందునే బాలు న్ని ఆసుపత్రిలో వదిలిపెట్టి ఉండవచ్చని భావించారు. ఐతే రిమ్స్ అధికారులు ఐసీడీఎస్‌కు చెందిన శిశుగృహానికి అప్పగించారు. శిశుగృహం వారు బాలునికి అర్జున్ అని నామకరణం చేసి, కొన్ని రోజులు బాలుని ఆలనాపాలనా చూసుకున్నారు.శిశుగృహం ద్వారా ఈ దంపతులు 9 ఏళ్ల క్రితం బాలున్ని చట్టబద్ధంగా దత్తత తీసుకొని డెన్మార్కుకు తీసుకెళ్లా రు. ప్రస్తుతం తొమ్మిదేళ్లు రావడంతో అర్జున్ తనను కన్న తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలని కుతూహలంతో ఏర్పడింది.

దత్తతకు తీసు కున్న లూయి దంపతులను తన కన్నవారు ఎవరు అని ప్రశ్నించడంతో వారు ఆ బాలుడి ని తీసుకొని ఆదిలాబాద్‌కు వచ్చారు. బాలుడి తల్లిదండ్రుల ఆచూకు తెలిస్తే తమకు తెలియాజేయాలని వేడుకున్నారు. వారి వివరాలను గోప్యంగానే ఉంచుతామని, ఒకసారి బాలుడికి వారిని పరిచయం చేసి, తిరిగి ఆ బాలుడిని తమ వెంటే తీసుకువెళ్తామని చెప్పారు.