15 April, 2026 | 1:42 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

ఐపీఎస్‌పై ఎమ్మెల్యే వ్యాఖ్యలు అభ్యంతరకరం

01-02-2026 03:06 AM
  1. అధికారుల గౌరవం, సమగ్రత, స్వతంత్రతపై దాడే..
  2. ఖండించిన ఐఎఫ్‌ఎస్ అధికారుల సంఘం 

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి) : మేడారంలో అమ్మవార్ల దర్శనం సందర్భం గా తలెత్తిన వివాదంలో భాగంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కరీంనగర్ సీపీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. డ్యూటీలో ఉన్న ఐపీఎస్ అధికారిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారుల సంఘం తీవ్రంగా ఖండిం చింది. విధి నిర్వహణలో ఉన్న ఒక ఉన్నతాధికారిని మతం పేరుతో దూషించడం, వ్యక్తిగత విమర్శలు చేయడం అత్యంత అభ్యంతరకరమ ని ఐఎఫ్‌ఎస్ అధికారుల సంఘం శనివారం ఒక ప్రకనలో పేర్కొంది.

ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమ ని సంఘం స్పష్టం చేసింది. నిజాయితీగా విధు లు నిర్వహిస్తున్న అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం ఆలిండియా సర్వీస్ అధికారుల గౌరవం, సమగ్రత, స్వతంత్రత పై దాడి చేయడమేనని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మతాలను ప్రస్తావిస్తూ అధికారులను లక్ష్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికింది.