31-07-2025 01:22:08 AM
నేటి నుంచి యాప్‌లో రిజిస్ట్రేషన్
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ఆగస్టు 1 నుంచి టీచర్లకు ఫే షియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేయనున్నారు. అ న్ని ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అమ లు చేయనున్నారు. గురువారం నుం చి యాప్‌లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టి ఈనెల 1 నుంచి పక్కాగా అమలయ్యేలా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
రాష్ట్రంలోని సర్కా రు బడులపై తల్లిదండ్రులకు మరింత నమ్మకం పెంచేలా, విధులకు డుమ్మా కొట్టే ఉపాధ్యాయుల ఆటకట్టించేందుకుగానూ ఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయనున్నారు. ఇప్పటికే ఎఫ్‌ఆర్‌ఎస్‌ను విద్యార్థులకు అమలు చేస్తున్నా రు. విద్యార్థులకు అమలు చేస్తున్నప్పు డు ఉపాధ్యాయులకు ఎందుకు అమ లు చేయరనే విమర్శలు వస్తుండటం తో తాజాగా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 1.07 లక్షల మంది వరకు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.