06-08-2025 12:55:28 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు ఒక స్కూల్ బస్సు(School Bus) స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. స్థానికులు వేగంగా స్పందించి బస్సు అద్దాలను పగలగొట్టి అందులో ఉన్న 27 మంది పిల్లలను సురక్షితంగా రక్షించారు. ఈ సంఘటన ముదినేపల్లి మండలం పెద్దకామనపూడి వద్ద జరిగింది. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.