calender_icon.png 5 August, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపు

31-07-2025 01:22:09 AM

జూబ్లీహిల్స్ సీనియర్ కాంగ్రెస్ నేత గుర్రం మురళీగౌడ్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ విజయం సాధించడం ఖా యమని జూబ్లీహిల్స్ సీనియర్ కాంగ్రెస్ నేత గుర్రం మురళీగౌడ్ ధీమా వ్యక్తం చేశా రు. గతంలో కాంగ్రెస్ హయాం లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనత తమ పార్టీకి దక్కిందని ఆయన గుర్తు చేశారు.

బుధవారం ప్రజాపాలనలో భాగం గా ప్రతి ఒక్కరికీ పౌష్ఠికాహారం అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్‌నగర్ డివిజన్ కమలానగర్‌లో కాంగ్రెస్ నేతలు సన్నబియ్యంతో వండిన భోజనాన్ని ఆరగించారు. కాంగ్రెస్ సీనియర్ దళిత నేత యాదయ్య నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నేత గుర్రం మురళీగౌడ్, ఇతర నాయకులు ఎండీ గౌస్, యాదగిరి, చంద్రమౌళి, కొండపల్లి రమేశ్ సన్న బియ్యంతో వండిన భోజనాన్ని ఆరగించారు.

ఈ సందర్భంగా మురళీగౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన సర్కారు ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజ కవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిందన్నా రు. ఈ సన్నబియ్యం భోజన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని చాటి చెప్పే ప్రయత్నం చేశారు.