15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నిబంధనలకు మించి ఖర్చు పెట్టకూడదు

05-02-2026 10:18 AM

ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ బాబు 

భూత్పూర్ : మున్సిపాలిటీలకు జరుగనున్న  కౌన్సిలర్లుగా గా పోటీ చేస్తున్న  అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిమితికి మించి అత్యధికంగా ఖర్చులు చేయకూడదని ఎన్నికల వ్యయ పరిశీలకుడు  శ్రీనివాస్ బాబు అన్నారు. ఎన్నికల్లో ప్రచార నిమిత్తం చేసే ఖర్చు ల వివరాలు ఏ విధంగా నమోదు చేయాలో పోటీలో ఉన్న అభ్యర్థులకు  భూత్పూర్ మున్సిపాలిటీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సదస్సు కు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు  శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలు చేశారు. ఈ నెల తేదీ 5,7,9 వ తేదీ లలో వ్యయo చేయు సమయంలో వ్యయాలకు సంబంధించిన వోచర్లు, బిల్లులు తీసుకోవాలన్నారు. 

వాటిని రిజిస్టర్ల తనిఖీ సమయంలో అభ్యర్థి గాని అతని ఏజెంట్ గాని హాజరై వారి రిజిస్టర్ లు సంబంధిత అధికారులచే  వెరిఫై చేయించుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే అన్ని లావాదేవీలు చేయాలన్నారు. ఎన్నికల ఖర్చులన్నింటినీ అభ్యర్థి ఎన్నికల ప్రయోజనం కోసం తెరిచిన బ్యాంకు ఖాతా నుండి చెల్లించాలన్నారు.   రెవెన్యూ  అదనపు కలెక్టర్  మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ  జిల్లా ఎన్నికల అథారిటీ ఎన్నికలు నిష్పక్ష పాతంగా  నిర్వహిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమం లో జిల్లా వ్యయ పరిశీలన నోడల్ అధికారి కె. టైటస్ పాల్  మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల లోపు ఎన్నికల లో పోటీచేసిన ప్రతి అభ్యర్థి విధిగా తాము నిర్వహించిన ఎన్నికల ఖర్చుల వివరాలను సంభందించిన మునిసిపల్ కమిషనర్ లకు సమర్పించాలి లేదంటే మున్సిపల్ చట్ట ప్రకారం, ఎన్నికల నిబంధనల మేరకు తగు చర్య తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ టీం సభ్యులు  జగన్ మోహన్ రెడ్డి, మనసుర్,  నంద కిశోర్  అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు పాల్గొన్నారు.